Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

విజయవాడ కనకదుర్గమ్మను (Vijayawada kanaka Durga temple) సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana) దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదపండితులు మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. 

CJI Justice NV Ramana offers prayers at Vijayawada kanaka Durga temple
Author
Vijayawada, First Published Dec 25, 2021, 11:00 AM IST

విజయవాడ కనకదుర్గమ్మను (Vijayawada kanaka Durga temple) సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana) దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదపండితులు మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో జస్టిస్ ఎన్వీ రమణ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని సీజేఐ‌కు అందజేశారు.

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికిన వారిలో మంత్రి పేర్ని నాని, విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani), దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరి జవహర్‌లాల్ కృష్ణ జిల్లా కలెక్టర్ నివాస్, ఆలయ అధికారులు ఉన్నారు. 

ఇక, శనివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు జస్టిస ఎన్వీ రమణ హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు. ఆదివారం కూడా జస్టిస్ ఎన్వీ రమణ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Also Read: ఒకే వేదిక‌పైకి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్‌.. నాడు ఫిర్యాదు, నేడు తేనీటి విందు..

ఇక, మూడు రోజుల పర్యటన నిమిత్తం జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఏపీకి చేరుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామం కృష్ణ జిల్లా పొన్నవరం వచ్చారు. అక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. పొన్నవరం, కంచికచర్ల లోనే తన ప్రాధమిక విద్య కొనసాగిందని జస్టిస్ ఎన్వీరమణ గుర్తుచేసుకున్నారు. 1960వ దశకంలోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం పొన్నవరం అని ఆయన ప్రశంసించారు. తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉండాలని .. కష్టపడే తత్వం ఉన్న తెలుగు వాళ్లు ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నారని ఎన్వీ రమణ కొనియాడారు. తన చిన్ననాటి మిత్రులను కలవడం సంతోషంగా ఉందని..  ప్రజలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios