వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.  

వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖలు తమ మద్దతు తెలియచేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు.

ఇటీవల సినీ నటులు పోసాని కృష్ణ మురళి, పృథ్వీలు జగన్   పాదయాత్రకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాటో గ్రాఫర్ చోటా కే నాయుడు కూడా వీరి జాబితాలో చేరిపోయారు.

సోమవారం.. మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు.