ఓపిక, ఊపిరి ఉన్నంత వరకు జగన్ తోనే.. సినీ నటులు

First Published 31, Jul 2018, 12:20 PM IST
cini actors prudhvi and jayachander supports jagan
Highlights

జగన్‌ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు

తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్ తోనే ఉంటానని సినీనటుడు పృథ్వీ పేర్కొన్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పాదయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని జగన్ కి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ  పేర్కొన్నారు. జగన్‌ అంటే ఓ నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు భావిస్తున్నారని ఆయన కొనియాడారు. మహానేత, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు జగన్‌ సీఎం అయితేనే అమలవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని విజయచందర్‌ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురం నియోజకవర్గంలోని విరవలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

loader