హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు అలీ ఆదివారం నాడు భేటీ అయ్యారు. వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ నెల 9వ తేదీన అలీ వైసీపీలో చేరనున్నారనే ప్రచారంలో ఉంది. జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్ ‌కు అలీ అత్యంత సన్నిహితుడు. పవన్ సినిమాల్లో అలీకి తప్పకుండా ఓ పాత్ర ఉంటుంది.

అయితే వైసీపీలో అలీ చేరాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో  పవన్ కళ్యాణ్ తో అలీ భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు అలీని ఇవాళ పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

జగన్‌కు అలీ ట్విస్ట్: జనసేనానికి జై కొట్టేనా?