వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్ నగదు డిమాండ్ చేశాడు. దీంతో  రైతు వెంకటరమణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

"

దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో వీఆర్వో రాజశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశంలో ఇది జరిగింది.

రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం కార్యాలయంలో వీఆర్వో ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం వీఆర్వో రాజశేఖర్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు.