చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి టిడిపిలో చేరారు. క్యాంపు కార్యాలయంలో చంద్రబాబునాయుడును కలిసిన రెడ్డి టిడిపిలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వెంటనే చంద్రబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుప్పంకు చెందిన రెడ్డి మొన్నటి వరకూ వైసిపిలో ఉన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే సుబ్రమణ్యంరెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. అప్పటికే రెడ్డి టిడిపిలో చేరుతున్న విషయం తెలుసుకున్న వైసిపి నేతలు లైట్ గా తీసుకున్నారు.