హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సినిమాల కిక్కే ఆనందాన్నిస్తున్నట్లు ఉంది. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవిని అభిమానులు తిరిగి పెద్ద యెత్తున ఆదరించారు. ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో పోగొట్టుకున్న చోటనే వెత్కుక్కోవాలనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నారు.

రీఎంట్రీని అభిమానులు ఘనంగా స్వాగతించడంతో ఆయన సైరా సినిమాకు అంగీకరించారు. బ్రిటిష్ పాలకులపై పోరాడిన రాయలసీమ యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సైరా సినిమా షూటింగులో ఆయన బిజీగా గడుపుతూ వస్తున్నారు. 

అయితే, తాజాగా చిరంజీవి మరో సినిమాను కూడా అంగీకరించారు. చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. తన తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. దాన్ని బట్టి ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. 

కాంగ్రెసు పార్టీకి ఆయన దూరమవుతున్న సంకేతాలను ఆయన స్పష్టంగానే ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో దానయ్య నిర్మించే సినిమాలో తాను నటించబోతున్నట్లు ఆయన తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి జీవం పోసుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెసు పార్టీకి చిరంజీవి రాజకీయాలకు దూరం కావడం పెద్ద దెబ్బనే. నిజానికి, తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం కూడా చిరంజీవికి పెద్దగా ఇష్టం లేనట్లు అనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి