పవర్ స్టార్ కు ఇండస్ట్రీ నుంచి శుభాకంక్షల వెల్లువ.. ఊహించని రీతిలో పవన్ ను విష్ చేసింది ఎవరంటే..?
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కు ఊహించని రీతిలో శుభాకంక్షలు వెల్లువలా వస్తున్నాయి. స్టార్స్ అంతా ఎక్స్ వేదికగా పవన్ ను అభినందిస్తున్నారు.
ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది ఆంధ్రాలో హడావిడి చేస్తున్నారు. పవర్ స్టార్ గెలుపుతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరకూ పవర్ స్టార్ గెలుపును ఆస్వాదిస్తూ.. ట్వీట్ చేస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి విజయాన్నిసెలబ్రేట్ చేసుకున్నారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.. దెబ్బ తిన్న ప్రతీసారి పట్టుదలతో పనిచేశావంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్.
పవర్ స్టార్ ను విష్ చేసిన వారిలో హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు. పిఠాపురం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కు కాజల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇక అల్లు అర్జున్ కూడా ఈ విక్టరీ సందర్భంగా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ విజయానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అటు సాయి ధరమ్ తేజ్ కూడా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎవర్రా మనల్ని ఆపేది అంటూ.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.
ఇక డైరెక్షర్ హరీష్ శంకర్ అయితే పవర్ స్టార్ ను విమర్షించినవారికి గట్టిగా కౌంటర్ వేస్తూ.. ట్వీట్ చేశారు. దత్త పుత్తుడు.. దత్త పుత్రుడు అన్నారు. దత్త పుత్రుడు కాదు.. దత్తాత్రేయపుత్తుడిగా విజయం సాధించి చూపించాడు అంటూ హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక యంగ్ హీరో కార్తికేయ కూడా పవర్ స్టార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవితో పవన్ ఉన్న ఫోటోను శేర్ చేసిన కార్తికేయ.. పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు.
డైరెక్టర్ మారుతీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను విష్ చేశారు. ఓటు గెలిచిన రోజు.. జాతి గర్వించిన క్షణం అంటూ.. ఆయన ఎక్స్ వేదిక ద్వారా పవర్ స్టార్ ను విష్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అన్న మాటలను నిలబెట్టుకున్నాురు. ఎవడ్రా మనల్ని ఆపేది.. బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
14 వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి పవర్ స్టార్ 70 వేల వరకూ మెజారిటీతో వంగా గీతను ఓడించారు. దాంతో ..ఇక రాష్ట్రం అంతా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 15 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార్ విజయంతో పాటు.. దాదాపు 20సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.