మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు పాము కాటు: ఆసుపత్రిలో చేరిక
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోమవారం నాడు పాము కాటుకు గురయ్యాడు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చీరాల: మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోమవారంనాడు పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహించారు. ఆమంచి కృష్ణమోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వైద్యులు చికిత్స అందించారు. అక్కడి నుండి ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు ఆమంచి కృష్ణ మోహన్ కు చికిత్స చేస్తున్నారు.
2014లో చీరాల నుండి ఆమంచి కృష్ణ మోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2019లో చీరాల నుండి వైఎస్ఆర్‌సీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయనను పర్చూరు అసెంబ్లీ వైసీపీ ఇంచార్జీగా నియమించింది. చీరాల నుండి టీడీపీ నుండి పోటీ చేసి విజయం సాధించిన కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూర్ కు పంపింది వైసీపీ నాయకత్వం.