విజయవాడలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హల్ చల్ చేశారు. బెజవాడ నుంచి దెందులూరు వెళుతున్న చింతమనేని అనుచరుల కారు బందర్ ‌లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసింది. 

విజయవాడలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హల్ చల్ చేశారు. బెజవాడ నుంచి దెందులూరు వెళుతున్న చింతమనేని అనుచరుల కారు బందర్ ‌లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసింది.

దీనిపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అభ్యంతరం తెలపి.. కారును పక్కకు ఆపమని చెప్పి క్రేన్ సాయంతో కారును పీఎస్‌కు తీసుకెళ్లాడు.. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనుచరులు కానిస్టేబుల్‌ను అసభ్యపదజాలంతో దూషించి.. దాడికి పాల్పడ్డారు.

సదరు కానిస్టేబుల్‌ చింతమనేని అనుచరులపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ విషయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారు తన అనుచరులు కాదని.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

పవన్.. ఎవరయ్యా నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది.. నన్ను ట్యూటర్‌గా పెట్టుకో: చింతమనేని

పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

పులివెందులలో జగన్‌పై మాట్లాడగలవా..? పవన్‌కు... చింతమనేని సవాల్