దెందులూరులో నన్ను ప్రశ్నించినట్లు.. పులివెందులలో జగన్‌ని ప్రశ్నించగలవా అని పవన్‌ని ప్రశ్నించారు చింతమనేని ప్రభాకర్
దెందులూరులో నన్ను ప్రశ్నించినట్లు.. పులివెందులలో జగన్‌ని ప్రశ్నించగలవా అని పవన్‌ని ప్రశ్నించారు చింతమనేని ప్రభాకర్. పవన్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రభాకర్.. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా నియోజకవర్గానికి వచ్చి మాట్లాడి వెళ్లావు.. ఆధారాలు ఉన్నా లేకున్నా ఆరోపణలు చేసి వెళ్లావు.. భారతప్రభుత్వం ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛను ఇచ్చింది..
అందుకే ఊరుకున్నానని ఆయన అన్నారు. తాను ఒక్క మాట చెప్పి ఉంటే.. ఊరు దాటేవాడివి కాదని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. 1300 కోట్లతో తన నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశానని .. దెందులూరు అంటే అభివృద్ధి అని.. అభివృద్ధి అంటే దెందులూరు అనే విధంగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానన్నారు.
అభివృద్ధిని చేస్తున్నాను కనుకే అన్ని కులాలు, మతాల వారు తనను అభిమానిస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. నేను ఏ తప్పయినా చేసి వుంటే మొదట పవన్‌నే క్షమాపణ అడుగుతానని అన్నారు.
పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్
