మేం బస్సులు పెట్టలేదు.. కార్యకర్తలే చందాలేసుకుని వచ్చారు

chinna rajappa fires on ys jagan
Highlights

మేం బస్సులు పెట్టలేదు.. కార్యకర్తలే చందాలేసుకుని వచ్చారు

జనం చెవిలో పువ్వులు పెట్టడానికే ప్రతిపక్షనేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న జగన్‌కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చినరాజప్ప అన్నారు. ధర్మపోరాట దీక్షకు లక్షమందికి పైగా తరలివచ్చారని.. ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేశామంటూ ప్రతిపక్షనేత చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. కార్యకర్తలు చందాలు వేసుకుని బస్సుల్లో వచ్చారని చినరాజప్ప స్పష్టం చేశారు.. 

loader