ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు మాజీ మంత్రి దేవినేని అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలునిర్వహించారు. నెహ్రూ వ్యవసాయ క్షేత్రం గుణదలలో అంత్యక్రియలు జరిగాయి.

విజయవాడ గుణదలలోని నెహ్రూ స్వగృహం నుంచి నున్న మార్కెట్‌కు వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ క్షేత్రందాకా అంతిమయాత్ర కొనసాగింది.

ముఖ్యమంత్రితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌లతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోండా ఉమా, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు కరణం బలరాం, బుద్దా వెంకన్న, ఇతర పార్టీల ముఖ్య నేతలు నాయకులు పెద్దయెత్తున నెహ్రూ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు.

నెహ్రూను కడసారి చూసేందుకు అభిమానులు, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జోహార్ దేవినేని అంటూ అభిమానులు నినాదాలు చేశారు. నెహ్రూ కుమారుడు అవినాశ్‌ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.