చిత్తూరు:నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ప్రభుత్వం నుండి అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషదం తయారీకి సిద్దంగా ఉన్నామని టీటీడీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైద్యుల బృందంతో తాను  ఆనందయ్య  తయారు చేసిన మందును పరిశీలించినట్టుగా చెప్పారు. ఈ మందులో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని వైద్యులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

also read:శాస్త్రీయ అనుమతులు వచ్చాకే ఆనందయ్య మందు పంపిణీ:ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

శేషాచలం అడవుల్లో వనమూలికలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆనందయ్య మందు కరోనాకు పనికిరాదని తేలిస్తే ఇమ్యూనిటీ బూస్టర్ గా  ఇస్తామని ఆయన చెప్పారు.ఈ విషయమై ఆయుర్వేద ఫార్మసీలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.ఈ మందుకు అనుమతులు వస్తే  ఏ రకంగా మందును  తయారు చేయవచ్చు... రోజు ఎంత మొత్తంలో మందును తయారు చేసే అవకాశం ఉంటుంది, డిమాండ్ కు అనుగుణంగా మందును తయారు చేసే సామర్ధ్యం ఉందా అనే విషయమై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీనివాస మంగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీ వైద్యులతో చర్చించారు.