ఏపీలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ప్రజా ప్రతినిధుల ఇళ్ళల్లో.. ఒంటిమీద దుస్తులు లేకుండా హల్ చల్...(వీడియో)
చెడ్డి గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లుగా ఉన్న ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులకు చెడ్డీగ్యాంగ్ వచ్చినట్లు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ : జంట నగరాల ప్రజలను భయాందోళనకు గురి చేసిన cheddi gang ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీ గ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో దొంగతనాలు చేసిన ఈ ముఠా ఇప్పుడు vijayawadsలో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
"
చిట్టీనగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటీవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడిన ఘటనలో వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ గ్యాంగ్ visakhapatnam, గుంటూరు, తిరుపతిలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చెడ్డీగ్యాంగ్ ఆట కట్టించేందుకు పోలీసులు పట్టణం నుంచి గ్రామాల వరకు రాత్రి వేళలోప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
కాగా, చెడ్డి గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లుగా ఉన్న ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులకు చెడ్డీగ్యాంగ్ వచ్చినట్లు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
చెడ్డి గ్యాంగ్ లో ఉన్న ఐదుగురు సభ్యులు ఒంటి మీద దుస్తులు లేకుండా ఒక చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగా చుట్టుకుని రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో నుంచి వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, కాజా, పెదకాకాని, గుంటూరు లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి రాత్రి పూట గస్తీలను పెంచారు. దీంతోపాటు నేరస్తులను పట్టుకోవడంలో నైపుణ్యం పొందిన పోలీసులను మఫ్టీలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
తాడేపల్లి ప్రాంతం లో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డి గ్యాంగ్ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్ పోలికలు ఒకే విధంగా ఉండటంతో బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
టంగుటూరులో జంట హత్యలు: షోలాపూర్‌లో నలుగురు అరెస్ట్
పోలీసులను చెడ్డి గ్యాంగ్ మీద వివరణ అడగగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు
కాగా, విజయవాడలో కారుమురి నాగేశ్వరావు తనుకు ఎమ్మెల్యే ఫ్లాట్ 44, ఆమంచి కృష్ణమోహన్ చీరాల మాజీ ఎమ్మెల్యే ఫ్లాట్ 39, వెంకటరెడ్డి హైడ్రాలిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ MD ఫ్లాట్ 37లలో రాత్రి చెడ్డి గ్యాంగ్ దోపిడీకి యత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నవోదయ కాలనీ రెయిన్బో విల్లాస్ లో కూడా దొంగతనానికి ప్రయత్నం జరిగింది. అయితే అలికిడి అవ్వడంతో వాచ్ మెన్ కేకలు వేయటంతో దొంగలు పరార్ అయ్యారు. పలుగులతో తలుపులు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారు. అయితే డిసెంబర్ మూడో తేది అర్థరాత్రి జరిగిన ఈ దొంగతనం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.