టంగుటూరులో జంట హత్యలు: షోలాపూర్‌లో నలుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీ కూతుళ్ల హత్య కేసులో షోలాపూర్ లో నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని షోలాపూర్ నుండి ఒంగోలుకు తీసుకు వస్తున్నారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా Tanguturలో తల్లీ కూతుళ్ల హత్య కేసులో నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తల్లీ కూతుళ్లను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మృతులను sridevi, ఆమె కూతురు Venkata lekhaగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలో వృద్ద దంపతులు హత్యకు గురయ్యారు. వృద్దురాలి చెవిని కోసి బంగారు ఆభరణాలను దోచుకొన్నారు. ఈ ఘటన నవంబర్ 19న చోటు చేసుకొంది. ఈ రెండు ఘటనల్లో ఒకే ముఠా ఉందని పోలీసులు అనుమానించారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. దోపిడి దొంగలు టంగుటూరు, ఒంగోలు, అద్దంకి మీదుగా హైద్రాబాద్ కు చేరుకొన్నారు. అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకొన్నారు. దీంతో పోలీసులు మహారాష్ట్రలోని solapur కు వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం నాడు శ్రీదేవి, వెంకట లేఖ మృతదేహలకు పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేశారుత. మృతదేహలను బంధువులకు అప్పగించారు. హత్య జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పరిశీలించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో నేర స్థలాన్ని పరిశీలించారు.