రాజకీయ ప్రతీకార చర్యలకు ఏపీలో చంద్రబాబు నాయుడి అరెస్టు నిదర్శనమని ఎండీఎంకే నాయకుడు వైగో ఆరోపించారు. ఒక మాజీ సీఎంను టెర్రరిస్టులా అరెస్టు చేశారని చెప్పారు. ఇది దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం అని ఎండీఎంకే నాయకుడు వైగో అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అవసరమైతే చంద్రబాబు నాయుడికి సమన్లు జారీ చేసి, దాని ద్వారా విచారణ జరిపే అవకాశం ఉందని అన్నారు. కానీ అలా చేయలేదని చెప్పారు. ఆయనను ఒక టెర్రరిస్టులా అరెస్టు చేశారని తెలిపారు. ఇది దారుణం అని అన్నారు.
ఆదిత్య ఎల్ -1లో కీలక విన్యాసం.. భూమికి టాటా చెప్పి.. సూర్యుడి కక్ష్య దిశలో ప్రయాణం..
చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ కారణాలతోనే జరిగిందని తెలిపారు. ఈ విషయంలో జగన్ సంతోషించవ్చని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన సేవలను మాత్రం ఎవరూ తెరిపివేయలేరని తెలిపారు. అన్నింటినీ అధిగిమించి టీడీపీ అధినేత జైలు నుంచి బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆలయంలో ప్రసాదం తిని.. 50 మందికి పైగా అస్వస్థత.. తిరుపతిలోని కేవీబీపురంలో ఘటన
