Asianet News TeluguAsianet News Telugu

ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి: చంద్రబాబు వార్నింగ్

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే  విషయమై టీడీపీ నేతలు ఇంకా తేల్చుకోలేదు

chandrababunaidu warns to tdp senior leaders in kadapa district
Author
Kadapa, First Published Jan 4, 2019, 2:34 PM IST


అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే  విషయమై టీడీపీ నేతలు ఇంకా తేల్చుకోలేదు. ఈ విషయమై  మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డిల మధ్య ఎడతెగని చర్చలు జరిగినా కూడ ఎవరూ కూడ ఈ విషయమై తమ అభిప్రాయాలన్ని తేల్చలేదు అయితే  మీరు తేల్చుకోకపోతే తానే తేల్చుతానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పష్టం  చేశారు.

కడప జిల్లా జమ్మమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏళ్లతరబడి  ఆధిపత్య పోరు సాగుతోంది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆది నుండి టీడీపీలోనే ఉన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నుండి  ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆ తర్వాత  టీడీపీ గూటికి చేరుకొన్నారు.చంద్రబాబునాయుడు కేబినెట్‌లో ఆదినారాయణరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు.

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిని  సమీక్షిస్తున్నారు. అంతే కాదు సంక్రాంతి తర్వాత బాబు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తు చేస్తున్నారు.ఇందులో భాగంగానే కడప జిల్లా జమ్మలమడుగు సీటు విషయమై చంద్రబాబునాయుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డితో చర్చించారు.

జమ్మల మడుగు నుండి పోటీ చేసే విషయంలో  ఇంకా స్పష్టత రాలేదు. ఇద్దరు నేతలను  ఒక్క అంగీకారానికి రావాలని బాబు సూచించారు. జమ్మలమడుగు నుండి ఒకరికి సీటు ఇవ్వనున్నట్టు బాబు చెప్పారు. అయితే మరోకరికి కడప ఎంపీ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.  అయితే  జమ్మలమడుగును వదులుకొనేందుకు ఇద్దరు కూడ  ససేమిరా అన్నారు.

మీరిద్దరూ కూడ తేల్చుకోకపోతే తాను తేల్చాల్సివస్తోందని చంద్రబాబునాయుడు ఈ ఇద్దరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం.దీంతో  కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్, పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌లు కూడ వీరిద్దరితో సమావశమయ్యారు. అయినా కూడ వీరిద్దరూ ఎటూ తేల్చుకోలేకపోయారు. మీరు ఇద్దరూ కూడ ఏకాభిప్రాయానికి రావాలని బాబు సూచించారు. ఏకాభిప్రాయానికి రాకపోతే తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని బాబు హెచ్చరించారు.

కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేయడానికి తనకు  తన వర్గం నుండి సహకారం అంగీకరించాలని మంత్రి ఆదినారాయణరెడ్డి ఈ సమావేశంలో చెప్పారని తెలుస్తోంది. మరో వైపు తన సోదరులను కూడ ఈ విషయమై ఒప్పించాలని  కూడ  బాబు వద్ద ప్రస్తావించారని అంటున్నారు.

ఈ పరిణామాలపై  తన సోదరులను కూడ పిలిపిస్తానని  ఆదినారాయణరెడ్డి  బాబు వద్ద చెప్పినట్టు పార్టీ వర్గాల తెలిసింది. జమ్మలమడుగు నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై  ఈ వారంలోపుగా స్పష్టత రానుంది.  

రాష్ట్రంలోని సుమారు 100 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఈ నెల 17వ తేదీన చంద్రబాబునాయుడు విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే ఈ కసరత్తును నిర్వహించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios