తెగిస్తే మీరేం చేయలేరు: పోలీసులపై బాబు ఫైర్

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొంటే సహించబోనని ఆయన తేల్చి చెప్పారు.
 

chandrababunaidu serious comments on police department in vizag lns

విశాఖపట్టణం: పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొంటే సహించబోనని ఆయన తేల్చి చెప్పారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కిమ్స్ ఆసుపత్రిలో చంద్రబాబునాయుడు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

also read:అచ్చెన్నాయుడు అందుకే హీరో: జగన్ పై బాబు ఫైర్

 శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల విధి అని ఆయన చెప్పారు. లేనిపోని కొత్త కొత్త వేషాలు వేస్తే తనకు కూడ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

14 ఏళ్ల పాటు తాను కూడ వైసీపీ నేతల మాదిరిగా ఆలోచించి ఉంటే మీరు ఏమయ్యేవారని ఆయన ప్రశ్నించారు. మీ ఖాకీ బట్టలకు విలువ ఉండేదా అని ఆయన అడిగారు. 

ఒక లెవల్ వరకే ఓపికగా ఉంటామన్నారు. తెగిస్తే మీరేం చేయలేరని చంద్రబాబు హెచ్చరించారు. తమ సహకారం ఉంటేనే శాంతి భద్రతలను మీరు కాపాడుతారని ఆయన పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావాలి, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలంతా ట్యాక్స్ కడితేనే మీకు వేతనాలు వస్తున్నాయని ఆయన పోలీసులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios