హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కూడ హైద్రాబాద్ అభివృద్దికి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడూ కూడ అడ్డుపడలేదని  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.  కానీ, అమరావతిపై అధికార పార్టీ నేతలకు  అక్కసు ఎంత ఉందో తెలుస్తోందని  చంద్రబాబునాయుడు విమర్శించారు.

సోమవారం నాడు ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు ఇవ్వకుండా వెనక్కు వెళ్లింది. ఈ విషయమై అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన విమర్శలకు చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు.

రాజధాని అభివృద్దిని అడ్డుకొనేందుకు ఆనాడు వైఎస్ఆర్‌సీపీ నాయకులు లేఖలు రాశారని చంద్రబాబు గుర్తు చేశారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రపంచ బ్యాంకు అతి తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోందని  చంద్రబాబు చెప్పారు.  ఈ కారణంగానే ప్రపంచబ్యాంకు రుణాలను తీసుకొనేందుకు రుణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.

అమరావతి ప్రాజెక్టు నుండి వరల్డ్ బ్యాంకు వెనక్కు వెళ్లనున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖను పంపింది. మరో వైపు అమరావతి కాకుండా ఇతర ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేస్తామని ప్రపంచబ్యాంకు నిధులను మంజూరు చేస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

బాబు సర్కార్ తప్పిదమే: వరల్డ్ బ్యాంకు వెనక్కి వెళ్లడంపై మంత్రి బుగ్గన

జగన్‌కు షాక్: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న వరల్డ్‌బ్యాంక్

అమరావతి నిర్మాణానికి బ్రేకులు: ప్రపంచబ్యాంకు కొర్రీ