Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో లేనిపోని గొడవలు: జగన్ పై బాబు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో లేనిపోని గొడవలు సృష్టించి ఏం సాధించారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.
 

chandrababunaidu comments on ys jagan over Rayalaseema lift irrigation project
Author
Amaravathi, First Published Aug 10, 2020, 6:24 PM IST

అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో లేనిపోని గొడవలు సృష్టించి ఏం సాధించారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.

also read:పోతిరెడ్డిపాడు: సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కేవీయట్ పిటిషన్

సోమవారం నాడు ఆయన  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.తమ ప్రభుత్వ హయంలోనే పోతిరెడ్డిపాడు పెండింగ్ పనులను పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు.
వేలాది కోట్లను ఖర్చు చేసి రాయలసీమకు నీళ్లు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.  కర్నూల్ జిల్లాకు రూ. 3 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్టుగా ఆయన తెలిపారు. 

also read:13 జిల్లాల్లో అభివృద్ది, 13 నెలల్లో ఏం చేశారో చెప్పగలరా: వైసీపీని ప్రశ్నించిన బాబు

రాయలసీమకు జీవనాడి లాంటి ముచ్చుమర్రిని పూర్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ పై 64 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్పారు. అయితే 13 నెలల్లో జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ పై ఒక్క పైసా కూడ ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ మేరకు టెండర్లను కూడ ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios