అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సహా ఏపీ, తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారంనాడు కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. 
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ( పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని  సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను మంగళవారం నాడు రాత్రి దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:నదీ జలాలు: కేసీఆర్, జగన్ మధ్య చిచ్చు పెట్టిన పోతిరెడ్డిపాడు

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

also read:జగన్ కు కేసీఆర్ షాక్: పోతిరెడ్డిపాడుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి,7న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.