చంద్ర‌బాబు వ‌స్తున్నాడు నంద్యాల ఓట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే రోజా. చంద్ర‌బాబు కుట్ర‌ల హత్య‌రాజకీయాలు మొద‌ల‌వుతాయ‌ని ఆరోపణ. ముఖ్య‌మంత్రిని రాయ‌ల‌సీమ ద్రోహీగా చిత్రీకరించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడు నంద్యాల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే రోజా. శనివారం నుండి చంద్రబాబు కుట్రల హత్యరాజకీయాలు మొదలవుతాయని విమర్శించారు. నంద్యాల ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె మీడియా తో మాట్లాడుతు చంద్రబాబు పై ధ్వజమెత్తారు.
రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ను చంద్రబాబు ఆంధ్రకు తరలించారని ఆరోపించారు రోజా. చంద్రబాబు మన్నవరం ఎలక్ట్రానిక్ ఉపకరణల ప్యాక్టరీని పక్కన పడేశారని ఆమె తెలిపారు, వైఎస్ ఆర్ కి పేరు వస్తుందని ఆయన ఇలా చేశారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రిని రాయలసీమ ద్రోహీగా ఆమె చిత్రికరించారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చిన బాబు, మూడున్నర సంవత్సరాలుగా ఒక్కటైనా అమలు చేశారా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ గజినిగా చిత్రీకరించారు, గతంలో చెప్పింది నేడు గుర్తుండదు, నేడు చెప్పింది రేపు గుర్తుండదని ఆమె ఎద్దేవా చేశారు. ఆయనకు నంద్యాల్లో ఓటమీ భయం పట్టుకుందని, అందుకే అవినీతికి పాలుపడుతుందని రోజా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ కి టీడీపీ అవినీతి గురించి ముందే తెలుసుకున్నారు. అందుకనే గౌవరప్రదంగా తప్పుకున్నట్లు ఆమె పెర్కొన్నారు.
