ఆ రెండు ఘటనల్లో బాబును కాపాడిన సెక్యూరిటీ: నాడు గద్వాల, నేడు రాజమండ్రి
రాజమండ్రిలో స్టేజీపై నుండి తూలిపడబోయిన చంద్రబాబును సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. లేకపోతే చంద్రబాబుకు ప్రమాదం జరిగేది.
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేజీపై నుండి ప్రమాదవశాత్తు పడిపోతున్న చంద్రబాబును సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. సోమవారం నాడు కూడ రాజమండ్రిలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం నుండి చంద్రబాబు బయటపడ్డారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహించారు.ఉమ్మడి కర్నూల్ జిల్లా నుండి రాయలసీమ నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తెలంగాణలోకి చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించింది. ఈ పాదయాత్ర గద్వాలకు చేరుకున్న సమయంలో సభ నిర్వహించారు. సభ కోసం ఏర్పాటు చేసిన స్టేజీపై పరిమితికి మించి నేతలు ఎక్కారు. దీంతో స్టేజీ కుప్పకూలింది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది బాబును పట్టుకున్నారు. స్టేజీపై నుండి చంద్రబాబు కిందపడిపోకుండా సెక్యూరిటీ కాపాడారు.
also read:రాజకీయాల్లో చేరుతారా?: వై.ఎస్. షర్మిలతో వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ
ఇవాళ రాజమండ్రిలో జరిగిన రా కదలిరా సభలో కూడ ఒకేసారి పార్టీ నేతలు, కార్యకర్తలు రావడంతో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు స్టేజీపై నుండి కిందపడబోయాడు. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పట్టుకున్నారు.
also read:సాక్షిలో జగన్ కు నాకూ సమాన వాటా: కడపలో వై.ఎస్. షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రాజమండ్రిలో సభ నిర్వహించారు. రా కదలిరా పేరుతో ఈ సభలను తెలుగు దేశం నిర్వహిస్తుంది. రాజమండ్రిలో సభ ముగిసిన తర్వాత స్టేజీపైకి ఒక్కసారిగా పార్టీ శ్రేణులు రావడంతో తోపులాట జరిగిందని తెలుగు దేశం నేతలు చెబుతున్నారు.
also read:రాజమండ్రి టీడీపీ సభలో కిందపడబోయిన బాబు, కాపాడిన సెక్యూరిటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు 2817 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. 208 రోజుల పాటు 1253 గ్రామాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగింది. 2012 అక్టోబర్ రెండున హిందూపురంలో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. 2013 ఏప్రిల్ 28న విశాఖపట్టణంలో పాదయాత్రను చంద్రబాబు ముగించారు.