రాజకీయాల్లో చేరుతారా?: వై.ఎస్. షర్మిలతో వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ
కడపలో వై.ఎస్. షర్మిలతో వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ అయ్యారు.ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.
కడప: కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలతో దివంగత మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి కూతురు వై.ఎస్. సునీతా రెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. వీరిద్దరూ కడపలోని ఇడుపులపాయలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్. షర్మిల వై.ఎస్. సునీతా రెడ్డి షర్మిలతో భేటీ కావడం ఇదే తొలిసారి. వై.ఎస్. వివేకానంద రెడ్డి మరణించిన తర్వాత కూడ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడాన్ని గతంలో వై.ఎస్. షర్మిల తప్పుబట్టిన విషయం తెలిసిందే. వై.ఎస్. వివేకానంద రెడ్డిని హత్య కేసు దర్యాప్తు జాప్యంపై వై.ఎస్. సునీతా రెడ్డి న్యూఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశారు.
వచ్చే ఎన్నికల్లో వై.ఎస్. సునీతా రెడ్డి లేదా ఆమె తల్లి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో వై.ఎస్. షర్మిలతో వై.ఎస్. సునీతా రెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వై.ఎస్. సునీతా రెడ్డి లేదా ఆమె తల్లిని పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తండ్రి వై.ఎస్. భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.