అఖిలప్రియకు క్లాస్: ఎవీకి హామీ ఇవ్వని చంద్రబాబు

అఖిలప్రియకు క్లాస్: ఎవీకి హామీ ఇవ్వని చంద్రబాబు

అమరావతి: మంత్రి అఖిలప్రియకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లను కలుపుకుని వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. 

ఎవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేస్తున్నారని అఖిలప్రియ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి తన కూతురితో తమపై విమర్శలు చేయించారని ఆమె చెప్పారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుంటామని ఆమె చెప్పారు. 

కాగా, రాళ్లదాడి ఘటనపై ఆధారాలను ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు సమర్పించారు. ఆయన నంద్యాల శాసనసభ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దానిపై చంద్రబాబు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని అంటున్నారు. తగిన స్థానం కల్పిస్తామని మాత్రమే ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

దాంతో అఖిలప్రియతో సమస్య ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అనుసరిస్తానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. అళ్లగడ్డ, నంద్యాల పరిస్థితులను చంద్రబాబు వారిద్దరిని అడిగి తెలుసుకున్నారు.

గురువారం ఇరువురి మధ్య రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో చంద్రబాబు వారితో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. వారితో విడివిడిగా మాట్లాడారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos