నెమ్మదిగా చంద్రబాబునాయుడు స్టాండ్ మార్చుకుంటున్నారు. ఇంతకాలం ప్యాకేజి అంటూ మాట్లాడిన చంద్రబాబు హటాత్తుగా ప్రత్యేకహోదా నినాదాన్ని అందుకున్నారు. ప్రత్యేకహోదాపై ఇంతకాలం జగన్ చేస్తున్న డిమాండ్ ను తాజాగా చంద్రబాబు హైజాక్ చేయాలని చూస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్లు మంగళవారం మధ్యాహ్నం నుండి ‘పచ్చమీడియా’ ఒకటే హడావుడి మొదలుపెట్టింది.

చంద్రబాబు ఇంత హడావుడిగా ప్రత్యేకహోదా పై నాటకాలు ఎందుకు మొదలుపెట్టారు? అంటే, హోదా డిమాండ్ తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. జనాలు కూడా అటు కేంద్రంతో పాటు ఇటు చంద్రబాబుపైన మండిపోతున్నారు. ఏపిని కేంద్రం మోసం చేసిందనే అభిప్రాయం జనాల్లో పాకిపోయింది. అదే సమయంలో రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు ఫైల్ అయ్యారని జనాలు మండుతున్నారు.

జనాల మూడ్ గమనించే జగన్ కూడా ప్రత్యేకహోదాపై స్వరం పెంచారు. హోదా కోసం ఎంపిల రాజీనామాలని చెప్పి చివరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి కూడా రెడి అయ్యారు. దాంతో హోదాపై ఎంత మైలేజి వచ్చినా వచ్చేదంతా జగన్ కు ప్లస్ ప్రతిపక్షాలకే వెళుతుందని చంద్రబాబు గ్రహించారు.

సమస్యేమో తన ప్రమేయం లేకుండా మొదలై పరిష్కారం కూడా తన చేతిలో లేకుండా పోయింది. దాంతో జనాల ముందు చివరకు దోషిగా నిలవాల్సి వస్తుందన్న ఆందోళన మొదలైపోయింది. అందుకే హటాత్తుగా ‘ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే’ అంటూ చంద్రబాబు సమన్వయ కమిటిలో కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు పచ్చమీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు.

ఎలాగూ మీడియా చేతిలో ఉంది కాబట్టి ప్రత్యేకహోదా కోసం మొదటి నుండి పోరాటం చేస్తున్నది తాను మాత్రమే అని రాయించుకుంటారు. తన పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చిందని టముకు వేయించుకుంటారు. పార్లమెంటులో వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాసతీర్మానం ఏమవుతుందన్నది వేరే సంగతి. ఫలితం ఏమైనా సరే అడ్వాంటేజ్ మొత్తం తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకునే ఉంటారనటంలో సందేహమే లేదు.