చెన్నై: తమ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ఆరోగ్యంపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శివప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ను చంద్రబాబు పరామర్శించారు.  

శివప్రసాద్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శిపప్రసాద్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

శివప్రసాద్ ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు ఈ నెల 12వ తేదీ నుంచి శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకని వచ్చారు. 

అయితే, ఆ తర్వాత మళ్లీ వ్యాధి తిరగదోడడంతో గురువారం ఉదయం తిరిగి చెన్నై అపోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. శివప్రసాద్ కన్నుమాసినట్లు శుక్రవారం మధ్య పుకార్లు వ్యాపించాయి. వాటిని ఆయన అల్లుడు ఖండించారు. 

సంబంధిత వార్తలు

మీడియా అత్యుత్సాహం: మాజీ ఎంపీ శివప్రసాద్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లుడు

టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత..చెన్నైకి తరలింపు