టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన శివప్రసాద్.. 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా శివప్రసాద్ గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.