Asianet News TeluguAsianet News Telugu

జగన్ కు ఏసుక్రీస్తు, నాకు వెంకటేశ్వర స్వామి...: చంద్రబాబు సంచలనం

రాష్ట్రంలోని   శ్రీశైలం, తిరుపతి వంటి పెద్ద దేవాలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితికి వచ్చిందన్నారు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. 

Chandrababu serious comments on cm ys jagan
Author
Amravati, First Published Sep 23, 2020, 7:54 PM IST

గుంటూరు: మనుషులను చంపినా అడగకూడదు, మానభంగాలు చేసినా అడగకూడదు, తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించకూడదు, దేవాలయాలపై దాడులు చేసినా అడగకూడదు అన్నట్లుగా వైసీపీ పాలన ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మొదలు పెట్టిన దాడులను... నేడు దేవాలయాలను ధ్వంసం చేసే పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు.

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో జూమ్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని   శ్రీశైలం, తిరుపతి వంటి పెద్ద దేవాలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితికి వచ్చిందన్నారు. ఓ బూతుల మంత్రి ఏకంగా రథం తగలబడితే పోయేదేముంది, ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగితే దేవుడికి ఏమైపోతుందంటూ మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

''ఆ రోజు వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగిన తప్పిదాలను అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాను. కానీ నేడు డిక్లరేషన్ విషయంలో రాద్దాంతం చేస్తున్నారు. దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా కావచ్చు  ప్రజల నమ్మకాలను, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనేలా నేటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని... డిక్లరేషన్ ఎందుకివ్వాలి అనేలా మాట్లాడుతున్నారు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

read more   టచ్ చేసి చూడండి: భావోద్వేగానికి గురైన కొడాలి నాని

''హైందవ సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. భార్య ఉన్నపుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టం. టీడీపీ హయాంలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మతసామరస్యాన్ని కాపాడాం. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణచివేశాం. రౌడీయిజం, తీవ్రవాదాలను తొక్కిపెట్టి ప్రజల స్వేచ్ఛను కాపాడాం. జగన్మోహన్ రెడ్డికి ఏసు క్రీస్తు అంటే నమ్మకం ఉంది. కాబట్టి ఇంటిపై శిలువ చిహ్నం వేసుకున్నారు. నేను వెంకటేశ్వరస్వామిని నమ్ముతా. ముస్లింలు అంతా అల్లాను నమ్ముతారు. అది వారి వారి నమ్మకం. దాన్ని గౌరవించాలే తప్ప హేళన చేయడం తగదు'' అన్నారు. 

''ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనుషుల ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, మానానికి భద్రత లేదు, చివరకు దేవాలయాలకు కూడా భద్రత లేకుండా పోయింది. దుర్మార్గుల చేతుల్లోకి పాలన వెళితే దుర్మార్గాలు ఎన్ని జరుగుతాయో ఏపీలో ప్రస్తుత పరిస్థితులే ఉదాహరణ. రాక్షస పాలన గురించి పురాణాల్లో విన్నాం, ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాం గానీ.. ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. 5 శాతం ఓట్ల మార్పుతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరో 5 శాతం ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదు'' అని పేర్కొన్నారు. 

''ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో అందరూ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను ఎండగట్టాం, ఎస్సీలపై దాడులను ప్రశ్నించాం, ఎదురు నిలిచాం. చివరికి అచ్చెన్నాయుడు ఎలాంటి తప్పు చేయకపోయినా.. అక్రమ కేసుల్లో ఇరికించారు. కానీ.. నేడు మంత్రులే పేకాట ఆడిస్తున్నారు. ఇసుక, మద్యం, మట్టితో కూడా వ్యాపారం చేస్తున్నారు. నవరత్నాల పేరుతో సంక్షేమాన్ని నాశనం చేశారు. ఆ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా వారి పార్టీ వాళ్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా ఉన్నందున.. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. పత్రికలు, ఛానళ్లు ఉన్నప్పటికీ.. మీడియాను కూడా ప్రభుత్వం బెదిరిస్తోంది. జీవో నెం.2430తో మీడియాను కూడా నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు'' అని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios