అమరావతి:విశాఖలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న వైసీపీ నేతల మాటల్లో వాస్తవం లేదన్నారు.

గురువారం నాడు ఆయన రాయపూడిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.  విశాఖలో కొన్ని కంపెనీలు భూములు కొనుగోలు చేశాయన్నారు. వాటిని నిరూపిస్తానని ఆయన చెప్పారు. 

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. 18 నెలలు జరిగింది, ఇప్పటివరకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అనేక కమిటీలు, విచారణలు చేశారు. ఏం చేశారని ఆయన అడిగారు.

also read:మూడు రాజధానులకు ప్రజలు ఒప్పుకొంటే రాజకీయాల నుండి తప్పుకొంటా: చంద్రబాబు

అమరావతిలో రైతుల వద్దే భూములున్నాయన్నారు. రైతులకు ప్లాట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారని ఆయన జగన్ ను ప్రశ్నించారు.

పోలీసులు కూడా ఈ రాష్ట్ర ప్రజలే. వారి పిల్లలు కూడ ఇక్కడే చదువుకొంటారు. పోలీసులు నిబంధనలను ఉల్లంఘించవద్దని ఆయన కోరారు.  ఎవరికి అధికారం శాశ్వతం కాదన్నారు.  నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.