‘ద్రోహులకు డాపాజిట్లు రావు’..ఇవి తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు...

‘లాలూచీ రాజకీయాలతో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావ’ని చంద్రబాబు చెప్పారు. సోమవారం పార్లమెంటులో జరిగిన పరిణామాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే, బిజెపిపై ఒక పార్టీతో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఇంకో పార్టీతో గొడవ చేయించి సభ వాయిదా వేసుకుని పోవాలని కేంద్రప్రభుత్వం చూస్తోందన్నారు. లాలూచీ రాజకీయాలకు ఇది పరాకాష్టగా చంద్రబాబు వర్ణించారు.  

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనే సర్వత్రా చర్చలు జరుగుతోంది. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పడతామని మొదట చెప్పిందెవరు? మొదట నోటీసు ఇచ్చిందెవరు? కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామంటే జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేసిందెవరో అందరికీ తెలిసిందే. కేంద్రమంత్రివర్గంలో నుండ మంత్రులను రాజీనామాలు చేయించమని జగన్ చేసిన డిమాండ్ కు చంద్రబాబు మొదలు టిడిపి మొత్తం ఏ విధంగా మండిపడిందో అందరూ చూసిందే.

వైసిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానికి పోటీగా అప్పటికప్పుడు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందెవరు? మద్దతు కోసం జాతీయ పార్టీల దగ్గరకు వైసిపి వెళితే అవే పార్టీల వద్దకు టిడిపి ఎంపిలను పంపింది ఎవరో కూడా తెలిసిందే. సోమవారం అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన తర్వాత స్పీకర్ వద్దకు వెళ్ళి వెల్ లో గొడవ చేసిందే పార్టీ ఎంపిలు? అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా సభను అడ్డుకుంటున్నది ఎవరో? ఏ పార్టీ ఎంపిలో కూడా అందరికీ తెలిసిన విషయాలే.

వాస్తవలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే, లాలూచీ రాజకీయాలు చేసే వాళ్ళకు, ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావని చంద్రబాబు చెబుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ద్రోహులెవరో? లాలూచీ రాజకీయాలు చేస్తున్నదెవరో తేల్చి చెప్పటానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.