ఆ రోజు పవన్ కల్యాణ్ తో అంతే జరిగింది: చంద్రబాబు

Chandrababu says talks were not held with Pawan
Highlights

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తాను గుంటూరు ఓ ఆలయంలో కలిసిన విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంత ఇచ్చారు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తాను గుంటూరు ఓ ఆలయంలో కలిసిన విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంత ఇచ్చారు. హలో అంటే హలో అనుకున్నామని, అంతకు మించి ఏమీ జరగలేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో మంగళవారం ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ తో రాజకీయ చర్చలేవీ జరగలేదని, ఈ విషయంలో పార్టీ నాయకులకు స్పష్టత ఉండాలని అన్నారు. 

బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వైసిపి సొంత మైకులా, బిజెపికి అద్దె మైకులా తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇక బిజెపి సాయం రాదన్నట్లుగా కన్నా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

loader