అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.  చంద్రబాబునాయుడు భద్రత విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై  ఆయన  స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశంలోనే అత్యంత హై - సెక్యూరిటీని కల్పిస్తున్నట్టుగా ఆయన స్పందించారు. ఈ మేరకు డీజీపీ సవాంగ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

Also read:జగన్ సర్కార్ మరో షాక్: జేసీ దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు 

ప్రస్తుతం చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్న విషయాన్ని డీజీపీ సవాంగ్ గుర్తు చేశారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేస్తున్నామని ఆయన వివరించారు.

మొత్తం 183 మందితో చంద్రబాబుకు భద్రతను కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. విజయవాడలో 135 మందితో, హైద్రాబాద్‌లో 48 మందితో భద్రతను కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు భద్రత విషయంలో తాము ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదన్నారు.