తనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

అమరావతి: తనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మంచి మిత్రుడు అని చెప్పుకోవడం కాదని, ఏపీకి నాలుగేళ్లలో ఏం చేశారో రాజ్‌నాథ్ చెప్పి ఉండాల్సిందని ఆయన అన్నారు. 

పాతపాటే పాడుతున్నారు గానీ చేసిందేంటో స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. టీడీపీ ఎంపీలకు టెలిఫోన్‌లో చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మంత్రులు స్పష్టంగా ఏం చేశామో చెప్పేవరకు వదలి పెట్టవద్దని, గట్టిగా నిలదీయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఏంచేశారో వారు నిజాయితీగా కేంద్ర మంత్రులు చెప్పడం లేదని అన్నారు. 

రాష్ట్రానికి ఏం చేశారో కచ్చితమైన లెక్కలు చెప్పేవరకు వదిలేది లేదని అన్నారు. రాజ్‌నాథ్ మాట్లాడినట్టే ప్రధానమంత్రి మోడీ కూడా పాత పాటే పాడే అవకాశం ఉందని ఆయన అన్నారు. 

రాజకీయాలు ఎలా ఉన్నా చంద్రబాబు తమకు మంచిమిత్రుడని లోక్‌సభలో రాజ్‌నాథ్‌ చెప్పిన విషయం తెలిసిందే. తమ బంధం వీడదీయలేనిదని, అది కొనసాగుతుందని ఆయన అన్నారు.