శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడకుండా యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి ముందే రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

విజయవాడ: శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడకుండా యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి ముందే రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత దానిపై చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించిన వారు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని ఆయన యడ్యూరప్ప రాజీనామాపై వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికో విధానం అన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎపికి అన్యాయం చేసినవారిని మట్టి కరిపించాలని తాను పిలుపునిచ్చిన విషయాన్ని ఆయ గుర్తు చేశారు. కర్ణాటక అయిపోయి ఉంటే ఆ తర్వాత తమపై పడి ఉండేవారని ఆయన బిజెపిపై వ్యాఖ్యానించారు. 

సాధికార మిత్ర కమిటీలో ఆయన యడ్యూరప్ప రాజీనామాపై స్పందించారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ప్రధాని, బిజెపి నేతలు రంగంలోకి దిగినా విజయం సాధించలేకపోయారని అన్నారు.