బాబుకు తలనొప్పి: 40 మంది సిట్టింగ్‌లపై ఆందోళన

Chandrababu naidu Warns 40 Sitting MLA's in Ap state
Highlights

40 సిట్టింగ్‌లకు మొండిచేయి 


అమరావతి: 2019 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన  అన్ని రకాల శక్తియుక్తులను టిడిపి  ఇప్పటి నుండి  ప్రదర్శిస్తోంది.  ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేని వారిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది.  అయితే  ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు రాకపోతే కొత్తవారికి టిక్కెట్టు ఇవ్వాలనే యోచనలో  పార్టీ నాయకత్వం  యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని సుమారు 40 సీట్లలో ఇదే రకమైన పరిస్థితి ఉందని  పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  ఈ తరుణంలో ఈ 40 సీట్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం లేకపోలేదని  సమాచారం.


2019 ఎన్నికల్లో మరోసారి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటి నుండి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై బాబు  సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను బాబు సమావేశమౌతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించిన సమయంలో ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై బాబు  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లలో  సుమారు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు ఇప్పటికే చంద్రబాబునాయుడు  హెచ్చరికలు జారీ చేశారని  సమాచారం.  పనితీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. అయితే పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను బరిలోకి దింపితే  ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్టు అవుతోందని చంద్రబాబునాయుడు అభిప్రాయంతో ఉన్నారు.  ఈ తరుణంలో  పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల స్థానంలో  వచ్చే ఎన్నికల్లో కొత్తవారిని బరిలోకి దింపాలనే యోచనలో కూడ  బాబు ఉన్నారని సమాచారం.

అయితే కొత్త వారికి 40 స్థానాల్లో  అవకాశం కల్పిస్తే  తిరుగుబాటు అభ్యర్ధులుగా బరిలోకి దిగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు కూడ లేకపోలేదనే భయం కూడ పార్టీ నాయకత్వానికి ఉంది. దరిమిలా  పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు ముఖాముఖి సమావేశమై  పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారని సమాచారం.

బాబు నిర్వహించిన సర్వేల సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్టు దక్కుతోందో లేదో అనే భయం కూడ లేకపోలేదు. అయితే సిట్టింగ్‌లకు ఏ కారణం చేత వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకుండా నిరాకరిస్తున్న విషయాన్ని వారికి చెప్పాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అధికారంలోకి రాగానే నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నట్టు వారికి హమీ ఇవ్వాలని భావిస్తున్నారు. అప్పటికీ వారు వినకపోతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. 

అయితే చంద్రబాబునాయుడు వద్ద ఉన్న సర్వే జాబితాలో తమ పేర్లు ఉన్నాయా, లేవా అనే విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు సిట్టింగ్ లకు ఈ విషయమై చంద్రబాబునాయుడు పనితీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారని సమాచారం.


 

loader