తెలుగోడి పౌరుషం చూపించండి.. నిలదీయండి.. వదిలిపెట్టొద్దు: చంద్రబాబు

chandrababu naidu teleconference with tdp mps
Highlights

ఇవాళ రాజ్యసభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు

ఇవాళ రాజ్యసభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన సత్తా ఏంటో చూపించడానికి ఇదొక అవకాశమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని బాబు అన్నారు.. సభలో నిరసన తెలపడంతో పాటు వెలుపల కూడా ఆందోళన నిర్వహించాలని సూచించారు. చట్టాన్ని ఎందుకు అమలు చేయరో కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న అన్ని రకాల హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టొద్దని.. తెలుగోడి పౌరుషం చూపించాలని చంద్రబాబు అన్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బిల్లులపై చర్చ ఇలా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై కేంద్రంపై విరుచుకుపడాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రం కూడా సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నందున సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని.. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావని.. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

loader