జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా .. దానికి సీక్వెల్ వుండదు : తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పంచ్‌లు
జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అని .. అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ వుంటుందా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. టీడీపీ అగ్నికి పవన్ కళ్యాణ్ వాయువులా తోడయ్యారని .. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన కలయిక అని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా అని .. అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ వుంటుందా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన టీడీపీ జనసేన ‘జెండా’ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తామని.. టీడీపీ జనసేన కూటమి సూపర్‌హిట్ అని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్ పెడతామని.. టీడీపీ జనసేన విన్నింగ్ టీమ్ అని.. వైసీపీ చీటింగ్ టీమ్ అంటూ చంద్రబాబు పంచ్‌లు విసిరారు. టీడీపీ అగ్నికి పవన్ కళ్యాణ్ వాయువులా తోడయ్యారని .. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన కలయిక అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సభ చూశాక మా గెలుపును ఎవరూ ఆపలేరని అర్ధమైందని.. మాఫియా నేత కావాలా, ప్రజా సేవ చేసే నాయకులు కావాలా అని ఆయన ప్రశ్నించారు.
జగన్ వద్ద రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో స్కెచ్ వుందని.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూ ప్రింట్ వుందన్నారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము సంపద సృష్టించి పేదలకు పంచుతామని.. పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదన్నారు. రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నామని .. టీడీపీ జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నష్టం జరగకుండా చూశామని.. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్ అన్నారు.
వైసీపీ దొంగలపై టీడీపీ జనసేన పోరాడాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ జనసేన విజయకేతనం జెండా సభ ఇది అని .. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిశాయన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని ప్రజలు తరిమికొట్టాలని.. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. తాము చేతులు కలిపింది ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసమేనని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేతులు కలిపామని చంద్రబాబు తెలిపారు. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేతులు కలిపామని.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ జనసేన పొత్తు అని ఆయన వెల్లడించారు.
రాష్ట్రం కోసం ప్రజలు కుదిర్చిన పొత్తు ఇదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తమతో చేతులు కలపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు వుందని.. రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని.. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని వుండాలని అమరావతికి రూపకల్పన చేశామని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్తామని .. రాష్ట్రంలో సైకో పాలన వుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని.. జగన్ సీఎం అయ్యాక ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
జగన్ సీఎం అయ్యాక ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారని.. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ పాలన.. పెత్తందారి వ్యవస్థకు నిదర్శనమన్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్ధితి నెలకొందని.. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్ మీడియాలో వేధించారని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక స్ధితికి ఈ ఘటనలే నిదర్శనమని.. అందరినీ అణచివేయడమే జగన్ ఆదర్శంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని చంద్రబాబు కోరారు. కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విభజించి పాలిస్తున్నారని.. అధికారం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్‌వన్‌గా చేయాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చంద్రబాబు తెలిపారు. వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల అని ఆయన పిలుపునిచ్చారు. హూకిల్డ్ బాబాయ్.. జగన్ సమాధానం చెప్పాలని , 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, తెచ్చారా అని చంద్రబాబు నిలదీశారు. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారని.. కుప్పంలో ఒక్క రోజులోనే అంతా సర్దుకుని పోయారని చంద్రబాబు దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు.