Asianet News TeluguAsianet News Telugu

నిజమేనా: ఆ ఇద్దరి మృతి వార్తపై షాక్ తిన్న చంద్రబాబు

ఆనాడు రోడ్డు ప్రమాదంలో  మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరణించిన విషయాన్ని  చంద్రబాబునాయుడు నమ్మలేదు. 

Chandrababu naidu shocks over harikrishna death
Author
Amaravathi, First Published Aug 30, 2018, 5:51 PM IST


హైదరాబాద్: ఆనాడు రోడ్డు ప్రమాదంలో  మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరణించిన విషయాన్ని  చంద్రబాబునాయుడు నమ్మలేదు. తాజాగా హరికృష్ణ కూడ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు వ్యక్తిగత సిబ్బంది చెప్పినా  ఆయన  వారిని మరోసారి  చెక్ చేసుకోవాలని  సూచించాడు. హరికృష్ణ  కారు ఎందుకు నడుపుతున్నాడని బాబు ప్రశ్నించారు. 

2012లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అప్పడు విపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నాడు. విశాఖపట్టణంలో  జరిగిన ఓ పెళ్లిలో పాల్గొని శ్రీకాకుళంకు తిరిగి వెళ్తుండగా  2012 నవంబర్ రెండో తేదీన టీడీపీ నేత ఎర్రన్నాయుడు  విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఎర్రన్నాయుడు మృతి చెందాడు.

అయితే ఈ ప్రమాదం జరిగిన  సమయంలో కూడ చంద్రబాబునాయుడు పాదయాత్రలో ఉన్నాడు. పాదయాత్ర రాత్రి పూట ముగించుకొని బస్సులో నిద్రించేవాడు. ఉదయం పూట స్నానం చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించేవాడు.

అయితే  ఉదయమే చంద్రబాబునాయుడు వ్యక్తిగత సిబ్బందికి ఎర్రన్నాయుడు చనిపోయాడనే విషయాన్ని పార్టీ నాయకులు తెలిపారు.అయితే  అప్పుడే చంద్రబాబునాయుడు నిద్ర లేచి  వ్యాయామం చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాబుకు చేరవేసిన వ్యక్తిగత సిబ్బందిపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏం చెబుతున్నారో మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించాడు.

అయితే  వ్యక్తిగత సిబ్బంది  ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.  అయితే బాబు స్వయంగా ఫోన్ చేసి కనుక్కొన్నారు.  అప్పుడూ కానీ, ఆయన నమ్మలేదు. వెంటనే ఆ రోజు పాదయాత్రను రద్దు చేసుకొని  శ్రీకాకుళం బయలుదేరాడు.  ఎర్రన్నాయుడు మరణించిన సమయంలో ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు విదేశాల్లో చదువుతున్నాడు. తండ్రి మరణించిన విషయం తెలుసుకొని విమానంలో ఇండియాకు బయలుదేరాడు.

చంద్రబాబునాయుడు కూడ  విమానంలో విశాఖకు చేరుకొన్నాడు.  అదే సమయానికి రామ్మోహన్ నాయుడు కూడ  విశాఖకు విమానంలో వచ్చాడు.  చంద్రబాబునాయుడు తన కాన్వాయ్ లో  రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళం తీసుకెళ్లాడు.ఎర్రన్నాయుడు చనిపోయిన సమయలో బాబు కన్నీళ్లు పెట్టుకొన్నాడు. 

ఇదిలా ఉంటే ఆగష్టు  29వ తేదీన హరికృష్ణ  అన్నెపర్తి వద్ద  రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు.  ఈ సమాచారం కూడ చంద్రబాబునాయుడుకు వ్యక్తిగత సిబ్బంది బుధవారం నాడు  ఉదయం చేరవేశారు.  

అయితే ఆ సమయంలో వ్యాయామం చేస్తున్న చంద్రబాబునాయుడు  నమ్మలేదు. హరికృష్ణకు శస్త్రచికిత్స జరిగిన నాటి నుండి  కారును నడపడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని హరికృష్ణ కారు ఎందుకు నడుపుతున్నాడని బాబు వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించాడు.  అంతేకాదు ఈ విషయాన్ని మరోసారి  చెక్ చేసుకోవాలని సూచించాడు.

తెలంగాణ రాష్ట్ర పోలీసులతో ఏపీ పోలీసులు  సమన్వయం చేసుకొని  ఈ విషయాన్ని మరోసారి బాబుకు చెప్పారు. అదే సమయంలో  తన సతీమణి భువనేశ్వరీకి ఫోన్ చేసి హరికృష్ణ రోడ్డు ప్రమాదం గురించి  చెప్పి కుటుంబాన్ని పరామర్శించాలని సూచించాడు. బాలకృష్ణకు కూడ ఫోన్ చేస్తే తాను కూడ దారిలో ఉన్నట్టు చెప్పారు.ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో కూడ మాట్లాడి సంఘటనస్థలానికి వెళ్లాలని  బాబు సూచించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తలుచదవండి

హరికృష్ణ అంత్యక్రియలు: చితికి నిప్పంటించిన కళ్యాణ్‌రామ్

హరికృష్ణ వెంట ఎప్పుడూ ఆ ఇద్దరే...

నందమూరి కుటుంబానికి ఈ రహదారి శాపం: యాక్సిడెంట్ జోన్లు ఇవే

సిద్దాంతి ముందే హెచ్చరించాడు: అయినా హరికృష్ణ

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...
 

Follow Us:
Download App:
  • android
  • ios