మడమ తిప్పడం, మాట మార్చడమే జగన్ నైజం: చిత్తూరులో చంద్రబాబు
చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బుధవారం నాడు పర్యటించారు. తమపై అక్రమ కేసులు బనాయించిన వారిపై జ్యూడిషియల్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు.
చిత్తూరు: తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై జ్యూడిషీయల్ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబు హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభను కౌరవ సభగా మార్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ సభను మళ్లీ గౌరవ భగా మార్చి ఆ సభకే వస్తానని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలోనే తన భార్య గురించి మాట్లాడారని... ఈ వ్యాఖ్యలు తనకు బాధను కల్గించాయని చంద్రబాబు చెప్పారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్ కు చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు.
చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ చీఫ్ chandrababu naidu బుధవారం నాడు పర్యటించారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు వరద కష్టాలు వచ్చేవి కావని చంద్రబాబు నాయుడు చెప్పారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు చెప్పారు.
రెండున్నర ఏళ్లుగా తనను వేధించారన్నారు. టీడీపీ నాయకులను వేధించారని చెప్పారు. విశాఖపట్టణానికి వెళ్తే తనను రాకుండా అడ్డుకొన్నారన్నారు. పల్నాడుకు వెళ్లకుండా తనను వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారని చెప్పారు. తన ఇంటిపై కూడా వైసీపీ దాడికి యత్నించారన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చారని పోలీసులు ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే తనకు మతి పోయిందని చెప్పారు. ఈ పోలీసుల స్టేట్ మెంట్ చూస్తే ఆ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని అర్ధమైందన్నారు.
alsro read:Heavy rains in AP: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ys jagan గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయాడని ఆయన విమర్శించారు. బాధిత ప్రజలను ఆదుకొంటామని భరోసా కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి పట్టించుకొంటే అధికారులు సక్రమంగా పనిచేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే అధికారులు సక్రమంగా పనిచేయరని చంద్రబాబు తెలిపారు.గతంలో కురిసిన వర్షాలకు అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయని, అయితే ఈ ప్రాజెక్టులకు మరమ్మత్తులను నాసిరకంగా పూర్తి చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మరో సారి ఈ రెండు ప్రాజెక్టులు కూడా తెగిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు.
ap assembly అసెంబ్లీలో తనను వైసీపీ సభ్యలు ఎగతాళి చేశారన్నారు. తన సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గురించి మాట్లాడుతున్నారంటే వీరంతా ఉన్మాదులా అని ఆయన ప్రశ్నించారు.మీ తల్లికో, చెల్లికో, భార్యకో ఇలా జరిగితే బాధపడారా అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై తాను అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ప్రయత్నిస్తే తనకు మైక్ ఇవ్వలేదన్నారు.
14 ఏళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఎలా పనిచేశాం, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. వరద సహాయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా ప్రతినిధులు ఎక్కడ ఉన్నారని ఆయన అడిగారు.
తన అనుభవం అంతా ఉండదు సీఎం జగన్ వయస్సు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం నేర్చుకోవాలనే తపన కూడా ఆయనకు లేదని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రూ. 6 లక్షల కోట్లను అవినీతిని చేసినట్టుగా ycp ప్రచారం చేసిందన్నారు. కనీసం 6 పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయిందని చంద్రబాబు చెప్పారు.ఏపీ శాసన మండలిని రద్దు చేయాలని తీఃసుకొన్న నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకొన్నారన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చి తిరిగి ఉప సంహరణ చేసుకొన్నారని చంద్రబాబు చెప్పారు. మాట తిప్పను, మడమ తిప్పను అని ప్రచారం చేసుకొన్న నేత తాను ఇచ్చిన వాగ్దానాలను మార్చుకొన్నాడని చంద్రబాబు విమర్శించారు.