రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది: పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు
టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలతో గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితిపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఈ నెల 8వ తేదీన వరి ధాన్యం కొనుగోలుపై, ఈ నెల 11న నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చెప్పారు.బుధవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీలతో టీడీపీ చీఫ్ Chandrababu సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.రాష్ట్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా బాధితులేనని చంద్రబాబు విమర్శించారు.ఐపీఎస్, ఐఎఎస్ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారని చంద్రబాబు వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
also read:వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి Ycp గ్రహణం పట్టిందన్నారు.మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదన్నారు.జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. ఇంటి నుండి బయటికొస్తే కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు వైసీపీపై మండిపడ్డారు. జగన్ తీసుకొన్న మూర్ఖపు నిర్ణయాలు, పిచ్చి పాలనతో ఏపీ కోలుకోలేని పరిస్థితికి వెళ్లిందన్నారు. ఇంత దారుణమైన పాలనను తాను ఏనాడూ చూడలేదన్నారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
టీడీపీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కూడా కొత్త కాదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ సమాజానికే కొత్త అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఇంకా ఉద్యోగులకు జీతాలు అందించని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తీరుతో చోటు చేసుకొన్న పరిణామాల విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు ఇస్తేనే పార్టీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. స్థానికంగా వైసీపీ నేతలు ప్రజలకు కల్గిస్తున్న నష్టంపై ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించడడమే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలపై కూడా పోరాటం చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీ వైపునకు తీసుకొచ్చేందుకు స్థానిక నాయకత్వం ఎప్పటి కప్పుడు పనిచేయాలని చంద్రబాబు కోరారు.
స్థానికంగా వైసీపీ నేతల అవినీతి, అరాచకాలపై కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ పాలన తీరును ఎప్పటి కప్పుడు ప్రజల్లో ఎండగట్టేందుకు స్థానిక నాయకత్వం చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు.
మరోవైపు 70 శాతం మండల కమిటీల ఏర్పాటు పూర్తైందన చంద్రబాబు.. మిగిలిన కమిటీల నియామకాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయాలని పార్టీ నేతలను కోరారు.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ఇటీవలనే ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు.
క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో కదలికి తీసుకొచ్చేందుకు మండల, జిల్లా నాయకత్వం కూడా చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ఇటీవలనే ప్రకటించారు. ఈ తరుణంలో ఇవాళ పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు.