నన్ను దొంగ దెబ్బతీసేందుకే  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.


అమరావతి: నన్ను దొంగ దెబ్బతీసేందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసుపై బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. తమపై దొడ్డిదారిలో దాడి చేస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ కారణంగానే రాష్ట్రంలోకి సీబీఐకు అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.

సీబీఐని అనుమతివ్వని కారణంగా ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్దమయ్యారని ఆయన ఆరోపించారు.ఎవరైనా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేకుండా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.