అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తెలుగుదేశం, జనసేనలు  మరింత వేగాన్ని పెంచాయి.

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు.రెండో జాబితా విడుదలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారని సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరి 24న తెలుగుదేశం-జనసేన పార్టీల తొలి జాబితా విడుదలైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 94 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. 24 మందిలో కేవలం ఐదుగురు అభ్యర్థులను మాత్రమే జనసేన ప్రకటించింది.

also read:అద్భుతం: హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సేవలు

ఈ నెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.దరిమిలా రెండో జాబితా విడుదలపై ఇద్దరు నేతలు కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందనే ప్రచారం కూడ సాగుతుంది.అయితే ఈ విషయమై బీజేపీ నాయకత్వం నుండి అధికారికంగా ప్రకటన రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో ఆ పార్టీ నేతలు పొత్తు విషయమై చర్చలు జరిపారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించింది బీజేపీ నాయకత్వం. పొత్తుల విషయమై ఈ వారంలో బీజేపీ అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

also read:కాంగ్రెస్ వైపు కోనప్ప చూపు: బీఆర్ఎస్ కు షాకిస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత నెలలోనే న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు. కానీ, పొత్తులపై బీజేపీ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదు.

Scroll to load tweet…

అయితే ఈ వారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. బీజేపీతో పొత్తు విషయమై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందంటున్నారు. 

also read:పన్ను చెల్లించేవారికి రైతు బంధు ఎందుకు: రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేయాలని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు.