కాంగ్రెస్ వైపు కోనప్ప చూపు: బీఆర్ఎస్ కు షాకిస్తారా?
సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతుంది.
ఆదిలాబాద్: సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భారత రాష్ట్ర సమితిని వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. తన అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. భారత రాష్ట్ర సమితితో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పొత్తు అంశం తెరమీదికి వచ్చింది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.
also read:పన్ను చెల్లించేవారికి రైతు బంధు ఎందుకు: రేవంత్ కీలక వ్యాఖ్యలు
2023 నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్ధిగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా కోనేరు కోనప్ప పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి కోనేరు కోనప్ప విజయం సాధించారు. కానీ, 2023 ఎన్నికల్లో కోనేరు కోనప్ప విజయం ఓటమి పాలయ్యారు.
also read:అద్భుతం: హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సేవలు, ప్రారంభించనున్న మోడీ
తన అనుచరులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కోనేరు కోనప్ప చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కోనేరు కోనప్ప చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
also read:పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: జాబితా రెడీ, రాహుల్ పోటీపై రాని స్పష్టత
ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోనేరు కోనప్ప కూడ పార్టీ మారాలని భావిస్తున్నారని సమాచారం.