Asianet News TeluguAsianet News Telugu

నన్ను చంపాలని చూశారు: పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణకు బాబు డిమాండ్

తనపై దాడి చేసి తనపైనే  హత్యాయత్నం  కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. 
 

Chandrababu Naidu Demands CBI Probe  On  Punganur  Violence lns
Author
First Published Aug 9, 2023, 2:38 PM IST

విజయనగరం:పుంగనూరు నియోజకవర్గంలోని  అంగళ్లులో తనను చంపాలనిచూశారని  టీడీపీ చీఫ్ చంద్రబాబు  ఆరోపించారు. విజయనగరంలో  బుధవారంనాడు చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.తనపై అంగళ్లులో జరిగిన ఘటనపై  సీబీఐ విచారణ చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో తేల్చాలన్నారు. మమ్మల్ని చంపి  రాజకీయం చేయాలని  భావిస్తున్నారా అని  ఆయన  ప్రశ్నించారు.  

ప్రాజెక్టుల సందర్శనకు  తాను వెళ్తుండగా  అంగళ్లు వద్ద వైఎస్ఆర్‌సీపీ నేతలు పథకం  అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయమై  ఎన్‌ఎస్‌జీతో  అధికారులు స్థానిక పోలీసులతో మాట్లాడారన్నారు. తన సీఎస్ఓ చిత్తూరు ఎస్పీతో కూడ మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు  చేశారు.వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడి చేస్తే  తాను  పారిపోవాలని వైఎస్ఆర్‌సీపీ నేతలు పన్నాగం పన్నారన్నారు.  తనపై  వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు రాళ్లు వేసిన సమయంలో  ఎన్‌ఎస్‌జీ సిబ్బంది  అడ్డుగా నిలిచారన్నారు.అయినా కూడ పోలీసులు  పట్టించుకోలేదన్నారు.  

also read:బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడుతున్నందుకే  తనపై దాడి చేశారన్నారు. తన కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ అడ్డుకుందని చెప్పారు.తనపై  దాడి చేసేందుకు  వచ్చి హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.ఎర్రగొండపాలెం, నందిగామలో  ఇలానే దాడులు చేస్తే  ఎన్ఎస్‌జీ కమెండో,  సీఎస్ఓ గాయపడ్డారని చంద్రబాబు గుర్తు  చేశారు. తాను  పుంగనూరుకు వెళ్లడం లేదని  చెప్పినా వినలేదన్నారు. అంగళ్లులో  వైఎస్ఆర్‌సీపీ  శ్రేణులను  పోలీసులు ఎందుకు  హౌస్ అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.  పుంగనూరులో  ఘర్షణలకు సంబంధించిన వీడియోను  చంద్రబాబు మీడియా సమావేశంలో  చూపారు. 

తనపై హత్యాయత్నం  చేస్తే  అందరూ  భయపడుతారని  మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి  పై  చంద్రబాబు  విమర్శలు చేశారు.  పిచ్చివాడి చేతిలో రాయిగా అధికారాన్ని వైఎస్ఆర్‌సీపీ  నేతలు  వాడుకుంటున్నారన్నారు.పుంగనూరు ఘటనలపై  సీబీఐ సమగ్రంగా విచారణ చేయాలని  ఆయన  డిమాండ్  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios