బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. కాలేజీ స్థాయి నుండి వీరి మధ్య ప్రారంభమైన పోరు ఇంకా సాగుతుంది.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య కాలేజీ నుండే ఆధిపత్య పోరు సాగుతుంది. తాజాగా పుంగనూరులో చోటు చేసుకున్న ఘటనలను చూస్తే వీరిద్దరి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యార్థి దశ నుండే చంద్రబాబునాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు రాజకీయాల్లో ఉన్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నారావారిపల్లెకు చెందిన చంద్రబాబునాయుడు తిరుపతిలోని ఎస్‌వీ జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. అదే కాలేజీలో అప్పటి పీలేరు అసెంబ్లీ స్థానానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ ఇదే కాలేజీలో చదివారు. వీరిద్దరూ ఎన్ఎస్‌యూఐ లో చురుకుగా ఉండేవారు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేవారు. లోకల్, నాన్ లోకల్, సామాజిక అంశాలు కూడ వీరిద్దరి మధ్య మరింత అంతరాన్ని పెంచాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
జూనియర్ కాలేజీ తర్వాత ఎస్‌వీ డిగ్రీ కాలేజీలో వీరిద్దరూ చేరారు. డిగ్రీకి వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. యూనివర్శిటీకి చేరుకునేసరికి మరింతగా పెరిగింది
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
ఎన్నికల ప్రచారానికి తిరుపతికి వచ్చిన ఇందిరాగాంధీ దృష్టిలో చంద్రబాబు పడ్డారు.దీంతో చంద్రబాబుకు 1978లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది.చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుండి చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.అంతేకాదు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడ బాబుకు అవకాశం దక్కింది. 1983లో ఇదే స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాతి నుండి చంద్రబాబునాయుడు కుప్పం నుండి పోటీ చేస్తున్నారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
1989 నుండి పీలేరు అసెంబ్లీ స్థానం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ లలో చంద్రబాబు అప్పట్లో యాక్టివ్ గా ఉండేవారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో గుమ్మడి కుతుహలమ్మ విజయంలో బాబు కీలకంగా వ్యవహరించారు. ప్రత్యర్థుల వ్యూహలకు పై ఎత్తులు వేస్తూ కుతూహలమ్మను జిల్లా పరిషత్ చైర్మెన్ గా గెలిపించారు. దీంతో చంద్రబాబు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
ఇదిలా ఉంటే 1978లోనే పులివెందుల నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి కర్నూల్ జిల్లా నుండి కేఈ కృష్ణమూర్తి కూడ అదే సమయంలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. వీరిమధ్య స్నేహం కుదిరింది. ఇదిలా ఉంటే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి కూడ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు.అయినా కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ మధ్య అంతరం తగ్గలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డి.శ్రీనివాస్ వర్గంలో కొనసాగారు. తన నియోజకవర్గంలో పట్టును పెంచుకున్నారు. టీడీపీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంద్రబాబు సంస్థాగతంగా పార్టీపై పట్టును పెంచుకున్నారు. 1995లో టీడీపీ సంక్షోభంలో ఎన్టీఆర్ ను గద్దెదింపి చంద్రబాబు సీఎం అయ్యారు.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
చంద్రబాబు సీఎం కాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్న సమయంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య అంతరం కొనసాగింది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో దఫా సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజీ కుదిరింది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లో చోటు కల్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్ వైపు నిలిచారు. జగన్ కోసం మంత్రి పదవికి కూడ రాజీనామా చేశారు.వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నారు. జగన్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్థానం దక్కింది.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
కాలేజీ స్థాయి నుండి చంద్రబాబు, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు.2019 ఎన్నికల సమయంలో ఒక రౌండ్ లో చంద్రబాబు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి కంటే వెనుకబడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. కుప్పం మున్సిపాలిటీలో కూడ వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
రామచంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. దీంతో పుంగనూరుపై బాబు ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఆధిపత్య పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో కాలమే నిర్ణయించనుంది.
బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?
గత వారంలో ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబు వెళ్తున్న సమయంలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.పుంగనూరు నియోజకవర్గంలోని కురబాల మండలం అంగళ్లు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘర్షణ విషయమై చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.