2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు వ్యక్తిగత కారణాలు ఏవీ లేవని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ విభేదాలతోనే తమ పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందని తెలిపారు.
2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగడానికి రాజకీయ విభేదాలే కారణమని, వ్యక్తిగత విభేదాలేమీ లేవని ఆ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన ‘ఇండియా టుడే’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య పొత్తు కుదిరిందని, తమ మూడు పార్టీలో ఓ అవగాహనకు వచ్చాయని ఆయన అన్నారు.
బీజేపీ కిచెన్ కిట్ పంపిణీలో తొక్కిసలాట.. ఓ మహిళ దుర్మరణం, పలువురికి గాయాలు
టీడీపీ మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ విభేదాల కారణంగానే 2018లో టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలిగిందన్నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంపద విధ్వంసం జరిగిందని, కానీ ప్రధాని నరేంద్ర మోడీ సంపద సృష్టిపై దృష్టి సారించారని కొనియాడారు. మరి కొద్ది రోజుల్లోనే సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు.
గుట్టలు, కొండలకు రైతుబంధు ఇవ్వబోం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఇదిలా ఉండగా ఈ నెల 17వ తేదీన ఏపీలో మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహించే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉంది. కాగా.. నేటి ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిశారు. వీరి మధ్య కొన్ని గంటల పాటు సమావేశం కొనసాగింది.
రాముడు ఇప్పుడు ఉంటే.. బీజేపీ ఈడీని ఆయన ఇంటికి పంపేది - కేజ్రీవాల్
అయితే ఇందులో ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను జనసేన, బీజేపీలకు దాదాపు 8 సీట్లు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో జనసేనకు 2, బీజేపీకి 6 సీట్లు కేటాయింపు జరిగిందని సమాచారం. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 24 సీట్లు అని ఇది వరకే తేలగా.. బీజేపీకి 6 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
