సీఎం అంటే లెక్కేలేదా..! తిరుమలలో చంద్రబాబు ఆండ్ ఫ్యామిలీకి అవమానం..
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేపట్టిన చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణకు ముందు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లిన ఆయనకు టిటిడి అధికారుల నుండి చెదు అనుభవం ఎదురయ్యింది.
తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. నిన్న సీఎంగా ప్రమాణస్వీకారం చేసినవెంటనే చంద్రబాబు ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకుంది చంద్రబాబు కుటుంబం. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు చేరుకున్న చంద్రబాబుకు అధికారుల నుండి అవమానం ఎదురయ్యింది... దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.
అసలేం జరింగింది...
చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని బాగా విశ్వసిస్తారు. ఆయన ఏ కార్యం చేపట్టినా తిరుమల శ్రీవారి దర్శించుకుంటారు. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే కుటుంబసమేతంగా శ్రీవారి దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు. ఇలా సీఎం హోదాలో తిరుమలకు చేరుకున్న ఆయనకు టిటిడి అధికారుల నుండి చేదు అనుభవం ఎదురయ్యింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించాల్సి వుంటుంది. తిరుమలలోనూ ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి వుంటుంది. తిరుమలకు చేరుకోగానే ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలకాల్సి వుంటుంది. కానీ తాజాగా చంద్రబాబుకు అలాంటి స్వాగతం లభించలేదు. గాయత్రి నిలయం వద్దకు చేరుకున్నా చంద్రబాబును కలిసేందుకు టిటిడి అధికారులెవ్వరూ రాలేదు. దీంతో చంద్రబాబు, ఆయన కుటుంబం ఎలాంటి స్వాగతం లేకుండానే గాయత్రీ నిలయంలోకి చేరుకున్నారు.
ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించేలా వ్యవహరించిన టిటిడి అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. గాయత్రీ నిలయంలో తనను కలిసేందుకు వచ్చిన టిటిడి ఇంచార్జ్ ఈవో వీరబ్రహ్మంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు... ఆయన పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించినా చంద్రబాబు తిరస్కరించారు.
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు ఆండ్ ఫ్యామిలీ :
నిన్న(బుధవారం) తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు రాత్రి అక్కడే బసచేసారు. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్ళిన చంద్రబాబుకు ఆలయ అర్చకులు సాంప్రధాయబద్దంగా స్వాగతం పలికారు. టిటిడి అధికారులు దగ్గరుండి చంద్రబాబు, కుటుంబసభ్యులకు స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదం అందజేసారు.
ఇవాళ సీఎంగా బాధ్యతల స్వీకరణకు ముందు చంద్రబాబు కుటుంబ సమేతంగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం ప్ర్తత్యేక విమానంలో విజయవాడకు చేరుకోన్నారు. నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్ని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటుంది చంద్రబాబు ఫ్యామిలి. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలో చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు.