సీఎం చంద్రబాబు విద్యాశాఖ అధికారులతో సమావేశం  విద్యా ప్రమాణాల పరంగా ప్రపంచ స్థాయికి  అమరావతి  అంతర్జాతీయ విద్యాసంస్థలకు అమరావతికి ఆహ్వానం  

రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది టీటీడి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రబాబు .అందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి వారికి ధిశా నిర్దేశం చేసారు.
రానున్న రోజుల్లో విద్యాశాఖను బలోపేతం చేసి రాష్ట్రాన్ని విద్యా కుసుమంగా తీర్చిదిద్దుతాని సీఎం శపథం పూనారు. ప్రపంచ స్థాయి నగరాల సరసన అమరావతి చేర్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అందుకోసం అమరావతికి దిగ్గజ విద్యా సంస్థలను ఆహ్వానించింది ప్రభుత్వం. అందరికీ విద్యా అందరికీ వికాసం అన్న నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.


 అందుకోసం 25 ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతికి ఆహ్వానించామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 14 సంస్థలు గతంలో జరిగిన వర్క్ షాపులో పాల్గొన్నాయని సీఆర్‌డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. వాటిల్లో వ్యాలీ స్కూల్, కెఎఫ్ఐ, చిరెక్, ఆర్ఎన్ పోడార్ స్కూల్, నలందా, చిన్మయా విద్యాలయ, రామకృష్ణ మిషన్ స్కూల్, గ్లిండన్, పొదార్ ఇంటర్నేషనల్, రయాన్ గ్లోబల్ స్కూల్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన స్కూళ్లు ఉన్నాయి.
 ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్య కోసం దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా మన ప్రయత్నం ఉండాలని సీఎం అధికారులకు ధిశా నిర్్దేశం చేసారు. అందుకోసం అవసరమైన భూమిని ఉచితంగా అందించేందుకైనా తాము సిద్ధమేనని అన్నారు. ధీరూభాయ్ అంబానీ ట్రస్టు తమ విద్యా సంస్థను అమరావతిలో నెలకొల్పేందుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.


ప్రపంచ ప్రమాణాలు గల విద్యాసంస్థలు స్థాపించడానికి ఎవరు ముందుకొచ్చినా ఆ ప్రతిపాదనలు మంత్రిమండలి ముందుంచి సత్వరం అనుమతులు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.